క్వాడ్ మీటింగ్ ఆసక్తికర సన్నివేశం…భారత ప్రధానిపై మరోసారి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రశంసలు

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా ..23వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 21వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఇక ఈ సదస్సుల కంటే ఎక్కువగా ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది మాత్రం క్వాడ్ మీటింగ్. సోలైర్ రిసార్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ కొత్త ప్రధాని సనాయ్ తకైచి భేటీ అయ్యారు. సమావేశానికి ముందు జరిగిన ఫోటో సెషన్ లో డొనాల్డ్ ట్రంప్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. తన ప్రారంభ సమావేశంలోనే ప్రధాని మోదీని ఉద్దేశించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ చాలా టఫ్ మ్యాన్ . ఆయనొక గొప్ప లీడర్, అలాగే ప్రధాని మోదీ తనకు అత్యంత ఆప్త మిత్రుడు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడిది అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది.
ఇక నాలుగు దేశాల ఈ క్వాడ్ కూటమికి బీజం వేసింది దివంగత జపాన్ ప్రధాని షింజో అబే. 2007లోనే దీనిని ప్రారంభించినప్పటికీ, చైనాకు ఎక్కడ కోపం వస్తుందో అన్న భయంతో చాలా కాలం పాటు ఇది సైలెంట్ గా ఉండిపోయింది. కానీ చైనా ఆగడాలు శృతి మించుతుండటంతో, మళ్లీ దీన్ని యాక్టివ్ చేశారు. బయటకు నేతలు ఎంత డిప్లమాటిక్ గా మాట్లాడినా.. క్వాడ్ కూటమి ప్రధాన ఉద్దేశం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి, దూకుడుకు అడ్డుకట్ట వేయడమే. ఇలాంటి క్రిటికల్ కూటమిలో భారత్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో సమానంగా ప్రపంచ వేదికపై నిలబడి చైనాను ఢీకొట్టే ధైర్యం మోదీ చూపించడం వల్లే ట్రంప్ ఆయనను టఫ్ మ్యాన్ అని పిలిచారు. ఒకప్పుడు ప్రపంచ యుద్ధం సమయంలో అగ్ర దేశాల నేతలు రూజ్వెల్ట్, చర్చిల్, స్టాలిన్ ఎలాగైతే ఒకే చోట కూర్చుని భవిష్యత్తును డిసైడ్ చేశారో.. ఇప్పుడు ఆసియాలో చైనాను కట్టడి చేయడానికి ఈ నలుగురు నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు అంతే పవర్ ఫుల్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్వాడ్ లీడర్స్ సమ్మిట్లో ప్రధాని న మోదీ కూడా కీలకమైన ప్రసంగం చేశారు. క్వాడ్ అనేది భారతదేశానికి ఒక నమ్మకమైన భాగస్వామ్యం అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. మెరైన్ సెక్యూరిటీ, క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్, క్లీన్ ఎనర్జీ, విపత్తుల నిర్వహణలో ఈ నాలుగు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఉటంకించారు. ఇటీవల అట్లాంటాలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో.. భారత్ , ఆసియాన్ దేశాల్లో వేస్ట్ నుంచి క్రిటికల్ మినరల్స్ ను రికవరీ చేసే మౌలిక సదుపాయాల కోసం అమెరికా 10 మిలియన్ డాలర్ల ఫండ్ ను కూడా ప్రకటించింది. అంటే ఈ కూటమి కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా యాక్షన్ స్టార్ట్ చేసింది. మరోవైపు మనీలాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఒకప్పుడు అమెరికా అంటే భారత్ కు కొన్ని పరిమితులు ఉండేవి. కానీ ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడే మోదీని టఫ్ మ్యాన్, గ్రేట్ లీడర్ అంటూ ఆకాశానికెత్తేయడం భారత్ ఎదుగుతున్న స్థాయికి నిదర్శనం. ఆసియాన్-ఇండియా సమ్మిట్ వేదికగా భారత్ తన యాక్ట్ ఈస్ట్ పాలసీని ఎంత పకడ్బందీగా అమలు చేస్తోందో ఈ మీటింగ్ స్పష్టం చేసింది.



