వారణాసి రిలీజ్‌కు ముందే ఆ రికార్డులేంటి..? ఓటీటీ డీల్‌కు కళ్లు చెదిరే ధర..?

తన విజన్ తో భారతీయ సినిమా స్థాయిని పెంచిన ఈ తరం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం వారణాసి.. ఇంకా థియేటర్లలోకి అడుగుపెట్టకముందే సినీ వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఫిల్మ్ నగర్లో, అంతర్జాతీయ ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఒక సంచలన వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో భారీ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వారణాసి ఓటీటీ హక్కులు ఏకంగా 400 కోట్ల నుంచి 450 కోట్ల వరకు పలికే అవకాశం ఉందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కేవలం ఓటీటీ మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల విషయంలోనూ కళ్లు చెదిరే డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. వారణాసి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఈ భారీ ఓటీటీ డీల్‌ను పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. భారతీయ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ డిజిటల్ హక్కులు రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు పలికే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ చేతికి తెలుగు హక్కులు: మరోవైపు థియేట్రికల్ బిజినెస్‌లోనూ వారణాసి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు సమాచారం. దీని కోసం ఏకంగా 290 కోట్లకు భారీ డీల్ కుదిరినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి . ఒక్క తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ , ఓటీటీ హక్కుల నుంచే ఇంత భారీ మొత్తం వస్తుండటం చూస్తుంటే, పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా చేయబోయే మొత్తం వ్యాపారం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.



