సుకుమార్ కోసం మెగా పవర్ స్టార్ మేకోవర్.. రామ్ చరణ్ కొత్త లుక్‌పై భారీ అంచనాలు!

ఈ ఏడాది ‘పెద్ది’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇప్పుడు తన నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నాడు. ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 17. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, ఈ డిసెంబర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త, అలాగే ఆయన ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుకుమార్ సినిమా కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకునేందుకు రామ్ చరణ్ ఎవరికీ తెలియని ఒక రహస్య ప్రదేశానికి వెళ్లారన్న టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రతిష్ఠాత్మక సినిమా, వచ్చే నెల అంటే డిసెంబర్ నుంచే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. షూటింగ్‌కు ముందు రామ్ చరణ్ తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చెర్రీ లుక్ చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, పెద్ది సినిమా కోసం పెంచిన ఆ పొడవాటి జుట్టు అందులో కనిపించలేదు. అంతేకాదు, మునుపటి కంటే ఆయన మరింత ఫిట్‌గా, బరువు తగ్గుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న క్రేజీ టాక్ ప్రకారం, సుకుమార్ మూవీ కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ఫామ్ అయ్యేందుకు రామ్ చరణ్ రెడీ అయిపోయారు. తన కొత్త లుక్‌ను పూర్తిస్థాయిలో సెట్ చేసుకునేందుకు దాదాపు మూడు రోజుల పాటు ప్రత్యేక విరామం తీసుకున్నట్లు సమాచారం. మీడియా కంట పడకుండా, ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ లొకేషన్లో రామ్ చరణ్ తన ట్రాన్స్‌ఫార్మేషన్‌కు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రత్యేక మేకోవర్, డైట్, వర్కౌట్ల కోసం ప్రత్యేక ట్రైనర్, చెఫ్‌లతో కూడిన సహాయక సిబ్బంది అంతా రామ్ చరణ్ వెంటే ఉండనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన పెద్ది సినిమాలోని లాంగ్ హెయిర్‌ను వదిలేసి, శరీర బరువును తగ్గించుకోవడం మొదలుపెట్టారు. అంటే డిసెంబర్లో సెట్స్‌పైకి వెళ్లే సరికి మనం ఒక సరికొత్త, స్లిమ్ అండ్ ఇంటెన్స్ రామ్ చరణ్‌ను చూడబోతున్నామన్నమాట. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌పై ఇంతలా క్రేజ్, అంచనాలు ఉండటానికి ప్రధాన కారణం ‘రంగస్థలం’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. అలాంటి మరపురాని బ్లాక్‌బస్టర్ తర్వాత, మళ్లీ ఇన్నాళ్లకు రామ్ చరణ్ , సుకుమార్ కాంబోలో ఆర్సీ17 వస్తుండటంతో మెగా అభిమానుల్లోనే కాదు, యావత్ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.




