తన పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్ షేర్ చేసుకుని నవ్వులు పూయించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తాజాగా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక అంశాన్ని అందరితో పంచుకోవడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. న్యూఢిల్లీ వేదికగా తన తల్లి సోనియా గాంధీ రాసిన ఆత్మకథ Belonging: A Journey of Love పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. తన తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు ఎక్కడ కలుసుకున్నారు? వాళ్లు ప్రేమలో పడిన ఆ రెస్టారెంట్ ఏంటి? అదే రెస్టారెంట్‌కు తను తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డేట్‌కు వెళితే ఎలాంటి అనుభవం ఎదురైంది అన్న విషయాలను చాలా సరదాగా గుర్తుచేసుకున్నారు. తను క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో.. తన గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకుని ఒక ప్రత్యేకమైన రెస్టారెంట్‌కు వెళ్లినట్లు రాహుల్ వెల్లడించారు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో మనం వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్దాం పద అని చెప్పి అక్కడికి తీసుకెళ్లానని, అయితే ఆ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటో ఆమెకు అప్పటికి తెలియదని రాహుల్ చెప్పారు. ఆ వర్సిటీ రెస్టారెంట్ ఎక్కడో కాదు, సరిగ్గా తన తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు తొలిసారి కలుసుకున్న ప్రదేశం అని ఆయన గుర్తుచేసుకున్నారు. రెస్టారెంట్ లోపలికి వెళ్లగానే, అక్కడ మెనూ తీసుకురావడానికి వచ్చిన ఒక వెయిటర్‌తో.. మా అమ్మానాన్నలు మొదటిసారి కలుసుకున్నది ఈ రెస్టారెంట్లోనే అని రాహుల్ చెప్పారు. దానికి ఆ వెయిటర్ వెంటనే ఆశ్చర్యంగా ఓహ్, ఆ ఇద్దరా.. మీరు ఎవరి గురించి చెబుతున్నారో నాకు కచ్చితంగా తెలుసు అని బదులివ్వడం రాహుల్‌ను కూడా ఆశ్చర్యపరిచింది.
వెయిటర్‌తో జరిగిన సంభాషణ తర్వాత, రాహుల్ చెప్పిన మరో ఫన్నీ ఇన్సిడెంట్ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఆ వర్సిటీ రెస్టారెంట్లో భోజనం విషయంలో తన తల్లిదండ్రుల టేస్ట్‌కు, తన టేస్ట్‌కు అస్సలు పొంతన లేదని రాహుల్ నవ్వుతూ పంచుకున్నారు. మా తల్లిదండ్రులకు ఆ రెస్టారెంట్‌లోని ఆహారం చాలా అద్భుతంగా అనిపించేది.. ఆ భోజనం చాలా బాగుందని వారు ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు అని రాహుల్ చెప్పారు. కానీ ఆ రోజు మెనూలో ఏది బాగుంటుందని రాహుల్ వెయిటర్‌ను అడగ్గా, అతను చికెన్ చ్యాసర్ అనే వంటకాన్ని సూచించాడట. రాహుల్ తన గర్ల్‌ఫ్రెండ్ కోసం, తన కోసం అదే ఆర్డర్ ఇచ్చారు. కానీ రాహుల్‌కు మాత్రం ఆ భోజనం రుచి అస్సలు నచ్చలేదు. ఈ విషయాన్ని స్టేజ్ మీద చెబుతూ..మీరు ఎవరైనా సరే ప్రేమలో పడాలనుకుంటే మాత్రం కచ్చితంగా కేంబ్రిడ్జ్ లోని ఆ వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లండి. కానీ దయచేసి అక్కడి చికెన్ చ్యాసర్ వంటకాన్ని మాత్రం ఎప్పుడూ తినకండి. దాని టేస్ట్ అస్సలు బాలేదు అంటూ రాహుల్ ఒక ఫన్నీ ఫుడ్ రివ్యూ ఇచ్చారు. రాహుల్ గాంధీ చేసిన ఈ కామెంట్స్‌తో ముందు వరుసలో కూర్చున్న సోనియా గాంధీతో సహా అంతా పగలబడి నవ్వారు.



