భారతితో కలిసి ఇవ్వాలిగా..జగన్ పై మంత్రి కొల్లు హాట్ కామెంట్స్..!

తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి స్పందించారు. మాజీ సీఎం జగన్ పై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉంటే సతీసమేతంగా ఇవ్వాల్సిన పట్టు వస్త్రాలను గడిచిన ఐదేళ్లలో ఒక్కసారైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. పేర్ని నానిపై కూడా మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ఐదేళ్లలో ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ గా […]

పోలవరం డీఎస్పీ ఆఫీసులో ఏలూరు ఐజీ- ఏం జరుగుతోంది ?

ఏలూరు రేంజ్ ఐజీ జి వి జి అశోక్ కుమార్ ఇవాళ పోలవరం డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసు ప్రాంగణాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం గురించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల్ని త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఆఫీసు రికార్డుల్ని పరిశీలించారు. పోలవరం గ్రామాల్లో మావోయిస్టుల కదలికలు లేవని ఐజీ అశోక్ తెలిపారు. మహిళలపై కేసులు, పోక్సో కేసులు,, […]

చంద్రబాబు, పవన్ ఘనత అదే-చినరాజప్ప ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఏపీలో 100 రోజుల కూటమి పాలనపై పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఈ రాష్ట్రాన్ని 100 రోజుల్లో ఎంతగానో సంక్షేమ పాలన అందించిన ఘనత సీఎం, డిప్యూటీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కే దక్కుతుందన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకేసారి వెయ్యి పెంచి నాలుగు వేలు చేయడమే కాకుండా […]

దేవరకు విశాఖలో భారీ షాక్..! రాత్రికి రాత్రి వెలిసిన పోస్టర్లు..!

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా దేవరాకు విశాఖలో షాక్ తగిలింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తక్షణమే స్పందించాలంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పేరిట పోస్టర్లు వెలిశాయి. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జన జాగరణ సమితి ఆధ్వర్యంలో పోస్టర్లు అంటించి తమదైన రీతిలో విజ్ఞప్తి చేశారు..జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి అంటున్న జన జాగరణ […]

జగన్ తిరుమల దర్శనం వేళ ఈవోను కలిసిన బీజేపీ నేతలు – కారణమిదే..!

తిరుమల లడ్డూ వివాదం, జగన్ దర్శనం ప్రయత్నాల నేపథ్యంలో బీజేపీ నేతలు ఇవాళ టీటీడీ ఈవోను కలిశారు. డిక్లరేషన్ నమూనాలను వెంట తీసుకెళ్లిన బీజేపీ నేతలు.. జగన్ తో దానిపై సంతకం చేయించాల్సిందేనని ఈవోను కోరారు. వైసీపీ హయాంలో డిక్లరేషన్ ను మర్చిపోయారని, అన్యమతస్తుల కోసం డిక్లరేషన్ ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నామని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ పై సంతకం పెట్టాలన్నారు. లేకపోతే తిరుమలకు వెళ్లకుండా అడ్డుకుంటామన్నారు.

పవన్ ఉడత ఊపులకు బెదిరేది లేదు-పేర్నినాని వార్నింగ్..!

ఇవాళ బందరులోని తన ఇంటిపై దాడికి జనసైనికులు ప్రయత్నించడంపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్ అయ్యారు.పవన్ ఉడత ఊపుళ్లకు బెదిరేది లేదన్నారు. సినిమా నటనతో రాజకీయ ప్రవేశం చేసి పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా సిద్ధాంతం లేకుండా మాట్లాడారని పేర్ని తెలిపారు. కులం లేదు మతం లేదు అని, హిందువులందరిని రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలకు, మతాలను రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్ ని మీడియా సాక్షిగా ఎండ కట్టానని తెలిపారు. బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి […]

వారం గ్యాప్ లో రెండు వరల్డ్ రికార్డులు-మెగా బ్రదర్స్ అరుదైన ఘనత..!

ఓ ఇంట్లో ఒకరు ఓ రికార్డు సాధిస్తేనే ఘనంగా చెప్పుకుంటాం. అదే వరల్డ్ రికార్డు సాధిస్తే తన చుట్టూ ఉన్న సమాజమే గొప్పగా చెప్పుకుంటుంది. అలాంటిది ఒకే ఇంట్లో పుట్టిన సోదరులు ఇద్దరూ వారం గ్యాప్ లో వరల్డ్ రికార్డులు అందుకుంటే.. అదీ వేర్వేరు రంగాల్లో ఇద్దరూ వాటిని అందుకుంటే.. ఆ ఊహే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదూ. కానీ దీన్ని నిజం చేసి చూపించారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ […]

అదీ లెక్కా…గిన్నిస్ బుక్‎లో మెగాస్టార్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది.వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి విభిన్న ఆహార్యం, నటన, డ్యాన్స్​కుగాను గిన్నిస్‌బుక్‌లో చోటు లభించింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఆయనకు ఈ అవార్డు అందించారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ హోటల్​లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్​కు చిరంజీవి , కుటుంబీకులు, సన్నిహితులు పాల్గొన్నారు. అవార్డు అందుకునే సమయంలో హీరో సాయి ధరమ్ […]

100 రోజుల పాలనపై సోనూసూద్ కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో సీఎం చంద్రబాబు పాలనపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ వంద రోజుల్లో ప్రభుత్వం చేసిందేమి లేదని వైసీపీ నుంచి విమర్శలొస్తుంటే.. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్న క్యాంటిన్లు వంటి పథకాలను అమలు చేయడంతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న ఘనత తమ ప్రభుత్వానికి […]

మళ్లీ కెమెరా ముందుకు పవర్ స్టార్

గత కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీ బిజీగా గడిపిన పవన్ మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు. ఈ నెల 23 నుంచి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ రీ స్టార్ట్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ను హాలీవుడ్ ఫైట్ మాస్టర్ నిక్ పోవెల్ తెరకెక్కించనున్నారు. గత నాలుగేళ్లుగా […]