మా మనోభావాలు దెబ్బతిన్నాయ్…పూర్తి విచారణ జరగాల్సిందే ; లడ్డూ ఎపిసోడ్ పై పండితులు
కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమల లడ్డూ తయారీపై వస్తున్న వార్తలు ఉన్నాయన్నారు ప్రముఖ జ్యోతిష్యపండితులు శ్రీరామచంద్రమూర్తి. తిరుమలకు దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం వచ్చి స్వామివారిని సేవించుకుంటారని ఆయన గుర్తు చేశారు. ఇలా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమలలో అపచారం జరిగిందన్న వార్తలు రావటం తమను కలిచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవటం ఒక్కటే మార్గమని చెబుతున్న శ్రీరామచంద్రమూర్తి.
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే లడ్డూ ఎపిసోడ్ ; వాసుపల్లి గణేష్
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వందరోజుల పాలన కంటే వైసీపీ పాలనే బాగుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే తిరుమల లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు. జమిలి ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం వైసీపీ వైపే ఉండబోతోందని చెబుతున్న వాసుపల్లి గణేష్
తిరుమల లడ్డూపై బాబు ఆరోపణలు నిజమే ; బీజేపీ నేత కీలక కామెంట్స్
పరమపవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో నిజముందన్నారు బీజేపీ సీనియర్ నేత కర్నాటి ఆంజనేయరెడ్డి. ఈ అపవిత్ర చర్యలకు పాల్పడినందుకు మాజీ సీఎం జగన్ సహా..టిటిడి ఛైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్నారెడ్డిలను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ఆంజనేయరెడ్డి
సింహాద్రి అప్పన్న లడ్డు నాణ్యతపైఅనుమానాలున్నాయి..
సింహాచలం సింహాద్రి అప్పన్న లడ్డు ప్రసాదం నాణ్యత పై భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం అన్నప్రసాదం కేంద్రం లో ఉన్న స్టోర్ ని సందర్శించారు. అన్నదానం లడ్డు ప్రసాదం పులిహార కి వాడే సరుకులను పరిశీలించారు . సందర్భంగా ఆయన నెయ్యి నాణ్యత పై పలు సరుకులు నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో 650 రూపాయలు పైబడి ఉన్న ఆవునెయ్యిని ఉత్తరప్రదేశ్ కి చెందిన […]
చంద్రబాబు లడ్డూ స్కెచ్ అందుకే-అసలు రీజన్ చెప్పిన వైసీపీ ఎమ్మెల్సీ ..!
ఇటీవల వచ్చిన వరదలకు అమరావతి తడిసి ముద్దయిందని, అక్కడ రాజధాని నిర్మాణానికి అవకాశం లేదని, దీనిని పక్కదోవ పట్టించడానికి సీఎం చంద్రబాబు కొత్తరకం పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డులో కలిపే నెయ్యి జంతువుల కొవ్వు నుండి తీసిన నూనె అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది పచ్చి అబద్ధమని, ముఖ్యమంత్రి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ స్కెచ్ వేశారని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 100 రోజుల్లో […]
కావలిలో కార్డన్ సెర్చ్..!
నెల్లూరు జిల్లా కావలి డిఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే శ్రీధర్ దుమ్ముదులుపుతున్నారు. మత్తు పదార్థాల, అసాంఘిక కార్యకలాలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కావలి రూరల్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్, తుఫాన్ నగర్, బాలకృష్ణ రెడ్డి నగర్ ప్రాంతాలలో డీఎస్పీ శ్రీధర్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద ఇళ్లల్లో తనిఖీ చేసి, అనుమానం ఉన్న వ్యక్తులను విచారించి సరైన పత్రాలు లేని 40 బైకులు, మూడు ఆటోలను సీజ్ చేశారు. […]
చంద్రబాబు లైట్ తీసుకున్నా, మేం వదిలిపెట్టం-షర్మిల వార్నింగ్..!
చంద్రబాబు తిరుమల లడ్డుపై సీఎం చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పినట్లు ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎసస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఇది చిన్న విషయం కాదని, సెంటిమెంట్ తో కూడిన అంశమన్నారు. ఈ విషయం ఇప్పుడే ఎందుకు బయట పెట్టారని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. దీని తీవ్రత ఆయనకు ముందే తెలుసా, తెలిస్తే ఎందుకు ప్రజలకు చెప్పలేదని అడిగారు. చంద్రబాబు 100 రోజుల పాలనపై ప్రజల అసంతృప్తి గమనించే, దాన్ని డైవర్ట్ చేసేందుకే ఇప్పుడు దీన్ని తెరపైకి […]
ఇంటర్ రద్దు వెనుక అసలు కారణమిదే..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్య వ్యవస్థను రద్దు చేయనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా విద్య వ్యవస్థపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఇంటర్ రద్దు, ఐదో తరగతి వరకు మాతృభాషలో బోధన.. వంటి కొత్త విధానాలను ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తరగతుల విషయంలో కూడా కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. అయితే ఇంటర్ రద్దు చేయడం వెనుక […]
తిరుపతి లడ్డూ చరిత్ర
కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డు ప్రసాదం. ఈ పుణ్యక్షేత్రం నుంచి భక్తులు తప్పక తమ వారి కోసం తీసుకు వెళ్ళేది అమృతమైన లడ్డూలే. ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డూకు కూడా అంతే ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంది. గత కొన్ని వందల ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా లడ్డూలను తయారు చేసి స్వామి వారికి ప్రసాదంగా పెడుతున్నారు. అసలు తిరుమల లడ్డూ తయారీ ఎప్పుడు మొదలుపెట్టారు. […]
బాలినేని బాటలోనే మరో జగన్ వీర విధేయుడు ! పవన్ కీలక హామీ..!
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన షాక్ నుంచి కోలుకోక ముందే వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు అండగా ఉంటూ, ఇంకా చెప్పాలంటే గతంలో వైఎస్సార్ కుటుంబానికి సైతం సన్నిహితంగా మెలిగిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బాలినేని బాటలో పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోబోతున్నారు. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి ఆయనకు కీలక హామీ లభించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ హయాం నుంచీ […]