ఏఐ సమ్మిట్ 2026:ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెస్తూ… AI పై చర్చిద్దాం:ప్రధాని మోడీ

Spread the love

దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మండపంలోని ఆర్టిఫీషియల్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహించడంపై ప్రధాని నరేంద్రమోడీ ఆనందం వ్యక్తం చేశారు. నేటి నుండి 20వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే ఈ సమ్మిట్ కు 45 దేశాలకు పైగా ప్రతినిధులు హాజరవనున్నారు. ఆయా దేశాలు తమ ఏఐ అజెండాలను వివరించనున్నాయి. మన టాలెంట్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను విస్తరించడం, విస్తృతం అవుతున్న స్టార్ట్ అప్ సంస్థల ఎకో సిస్టమ్ ను ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ సమ్మిట్ ఉద్దేశం.  ప్రపంచ దేశాలకు ఈ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పలికారు. ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెస్తూ… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై చర్చిద్దామని పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రపంచ దేశాలకు భారత యువత టాలెంట్, సామర్థ్యం తెలుస్తాయన్నారు. ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన సహకారం మరింత పెంపొందించుకునేందుకు ముందుకు సాగుతుందన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా డెవలప్ అవుతుందనే దానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనమని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ లో నిర్వహిస్తున్న ఈ మొదటి ఇంటర్నేషనల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ మన దేశంలో జరుగుతుండడం గర్వకారణమన్నారు. ఇక ఈ సమ్మిట్ థీమ్ అయిన ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ పై ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రపంచ దేశాల పురోగతి కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకోవడంలో మన ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందన్నారు. ఈ సమ్మిట్ తో డిజిటల్ ఫెసిలిటీస్ కల్పన, పవర్ ఫుల్ స్టార్ట్ అప్ ల ఏర్పాటు, మోడ్రన్ రీసెర్చ్ వంటి పలు డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భారత బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. హెల్త్ ప్రొటెక్షన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, గవర్నెన్స్ వంటి అనేక రంగాల్లో ఏఐ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు.