ఎంబ్రేర్ మరియు అదానీ గ్రూప్ మధ్య జరిగిన కీలక ఎంఓయూ ఒప్పంద కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధ్యక్షత వహించారు. భారత్‌లో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఇది వ్యూహాత్మక భాగస్వామ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఉడాన్ దార్శనికతతో ముందుకు సాగుతున్న ఈ సహకారం, ప్రాంతీయ వైమానిక కనెక్టివిటీ కోసం ఎండ్-టు-ఎండ్ స్వదేశీ పరిష్కారాల నిర్మాణంలో కీలకంగా నిలుస్తుందని తెలిపారు. దేశీయ భాగాల తయారీ, ఎంఆర్ఓ సేవల భాగస్వామ్యాల ద్వారా మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని బలపరుస్తూ, గ్లోబల్ ఏవియేషన్ సరఫరా చైన్ లో భారత్ పాత్రను మరింత శక్తివంతం చేస్తుందని స్పష్టం చేశారు. ఇక UDAN అంటే “Ude Desh ka Aam Naagrik” (ఉడె దేశ్ కా ఆమ్ నాగరిక్). అంటే “దేశంలోని సామాన్య పౌరుడు కూడా విమాన ప్రయాణం చేయాలి” అని అర్థం. తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం 2016లో దీనిని ప్రారంభించింది.