క్యాన్సర్ పై  అందరిలోనూ అవగాహన రావాలి:మెగాస్టార్ చిరంజీవి

Spread the love

ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. క్యాన్సర్ పై  అందరిలోనూ అవగాహన రావాలన్నారు. గతంలో తన  స్నేహితుడు ఒకరు క్యాన్సర్ బారిన పడితే వెంటనే గమనించి ట్రీట్మెంట్  తీసుకున్నాడని  దాన్ని నివారించగలిగినట్లు తెలిపారు. ఇప్పుడు పదేళ్ల నుంచి హాయిగా ఉంటున్నాడని పేర్కొన్నారు.  శరీరం చెప్పే మాట అందరూ వినాలని నాకు క్యాన్సర్ రాదులే అని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. మన అలవాట్లు, వాతావరణం, వంశపారంపర్యంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. మొదటి దశలోనే దాన్ని గుర్తిస్తే 90 శాతం తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని వివరించారు. అమ్మాయిలకు చిన్న వయసులోనే వ్యాక్సిన్లు వేయిస్తే కొన్నిరకాల క్యాన్సర్ల నుండి కాపాడొచ్చన్నారు. మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచించారు. అందరూ లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుని ఆరోగ్యకరమైన వాటిని తినాలన్నారు. భవిష్యత్తులో క్యాన్సర్ పై అవగాహన కోసం తాను షార్ట్ఫిల్మ్ లు తీయడానికి కూడా రెడీగా ఉన్నట్లు చిరంజీవి తెలిపారు. అది తన బాధ్యత అని అన్నారు. అందరూ జాగ్రత్తగా ఉంటూ ఈ మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.