రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పండగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు

Spread the love

 సంక్రాంతి పండగకు తమ పల్లెలకు వెళ్లే ప్రజలతో బస్సులు,రైళ్లలో రద్దీ పెరగనున్న నేపథ్యంలో ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-విజయవాడ మధ్య 10 స్పెషల్  రైళ్లను ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్  రైల్వే ప్రకటించింది. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పండగకు ముందు, తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు జరపనున్నాయి. జనవరి 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైళ్లు కొనసాగనున్నాయి. ఈరోజు నుంచి 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ఫెసిలిటీ  కల్పించారు. రిజర్వేషన్ చేసుకోని వారి కోసం రైలులో సగా పైగా జనరల్ బోగీల ఏర్పాటు చేశారు.