2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో చాలా అపచారాలు జరిగాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలను ఉదహరించారు. ఎన్నో సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఆనాటి ప్రభుత్వంలో ఒక్కరు కూడా బాధ్యతగా మాట్లాడింది, చర్యలు తీసుకుంది లేదని ఆక్షేపించారు. ప్రభుత్వంలోకి వచ్చిన రెండో నెలల్లో ఆరోపణలు, విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి అవసరం ఏముంటుంది ? అని ప్రశ్నించారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాట్లాడాం, రేపు ప్రజలు మాకు తెలిసినా ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు అనే బయటకొచ్చి మాట్లాడామని పవన్ పేర్కొన్నారు. హైందవ సంస్కృతి మీద వైసీపీ తరచుగా దాడులు, అపవిత్రాలకు తెగబడుతుండడం వల్ల ఎదుర్కోవాల్సిన అవసరం, మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వ్యక్తుల మీద, ప్రత్యర్ధుల మీద పగలు ఉంటాయి కానీ వీళ్ళ పరంపరకి భగవంతుడి మీద పగ ఉండటం ఏంటో అర్థం కాదని దుయ్యబట్టారు. ప్రత్యేకించి ఏడుకొండలస్వామి మీద పగ. ఏడు కొండలు ఎందుకు నీకు రెండు కొండలు చాలు అంటారని మండిపడ్డారు. దీన్ని కల్తీ నెయ్యి అనడానికి కూడా లేదు ఎందుకంటేదీనిలో అసలు నెయ్యే లేదు.తప్పు జరిగిపోయింది అని క్షమాపణ అడక్కపోగా ఎదురు మాపై మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా.. భగవంతుడిపైన పగ పెట్టుకున్నాడు సర్వనాశనం అయిపోతాడు, బతికిన దాఖలాలు కూడా లేవు గుర్తు పెట్టుకోండని మండిపడ్డారు. ప్రసాదాన్ని కల్తీ చేసి దేవుడికి పెట్టింది కాక నెయ్యి లేదు కాబట్టి కల్తీ లేదు అని బుకాయిస్తున్నారు.వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే గుండెపోటు అని చెప్తారు, అమ్మవారి వెండి సింహాల చోరీ జరిగితే పోతే పోయాయి అంటారు, దేవుడి విగ్రహానికి అపవిత్రం జరిగితే ఎవడో పిచ్చోడు చేసాడు అంటారు.దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళకి దేవుడు అంటే భయం, భక్తి లేవు.వెనకడుగు వేసేది లేదు, వైసీపీ హయాంలో చాలా పొరపాట్లు జరిగాయి. 2022 లోనే ఇలా కల్తీ జరుగుతుంది అని రిపోర్ట్ ఇస్తే దాన్ని బయటకి రానివ్వలా.అంటే మీకు తెలిసే చేశారు..ఇవన్నీ తెలిసే అయోధ్యకి కల్తీ లడ్డూలు పంపించారు. ఇది విశ్వాసాల మీద మీరు కొట్టిన దెబ్బని పవన్ మండిపడ్డారు. తప్పు చేసిన మీరు భగవంతుడికి మోకరిల్లెవరుకు వదిలే ప్రసక్తే లేదు.ఇది ఈ రోజుతో ఆగదు, ఈ పాపంలో భాగం ఉన్న ప్రతి ఒక్కరిని బాధ్యుల్ని చేస్తామని పవన్ స్పష్టం చేశారు.