పంజాబ్ కింగ్స్‌లోకి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్..అర్ష్‌దీప్ ముంబైకి..!

స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య భారత క్రికెట్ ప్రేమికులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఉర్రుతలూగించే ప్రతిష్టాత్మక క్రికెట్ లీగ్ ఐపీఎల్ లో ఇక పంజాబ్ కు ఆడనున్నాడు. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. గత మూడేళ్లుగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యను పలు సంప్రదింపుల తర్వాత పంజాబ్ కు ఇచ్చి బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ను తీసుకుంది. మూడేళ్ల క్రితం గుజరాత్ టైటాన్స్ ను వీడి ముంబై కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ లోనే 2022లో గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ ను అందించి సంచలనం సృష్టించాడు. 2015లో ఐపీఎల్ లో ముంబై తరపున ఆట ప్రారంభించిన హార్దిక్ 2015, 2017, 2019, 2020లో టైటిల్ గెలిచిన ముంబై జట్టులో సభ్యుడు. తన అసాధారణ ఆటతీరుతో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో కూడా సత్తా చాటాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ముంబైని వీడిన హార్దిక్, 2022లో కొత్తగా ఏర్పడిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. తన నాయకత్వ ప్రతిభతో అరంగేట్ర సీజన్లోనే గుజరాత్‌కు టైటిల్ అందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అనంతరం మూడేళ్ల క్రితం తిరిగి సొంత గూటికి చేరి ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం అతనికి ముంబై ఇస్తున్న రేటు రూ.16.35 కోట్లు. పంజాబ్ కు రూ.18కోట్లకు ఆడనున్నాడు. పెరిగిన రూ. 1.65 కోట్లలో రూల్స్ ప్రకారం సగం అతనికి మిగతా సగం ముంబై ఫ్రాంఛైజ్ కు దక్కనున్నాయి. మరోవైపు అర్ష్ దీప్ రూ.18కోట్లకు పంజాబ్ కు ఆడుతుండగా…ఇప్పుడు అదే ప్రైస్ కు ముంబైకి ఆడనున్నాడు. ఇప్పటివరకు టైటిల్ గెలవని పంజాబ్ కు హార్దిక్ రాక కలిసొస్తుందేమో చూడాలి. మైదానంలో హార్దిక్ పాండ్య ఉంటే ఆ జట్టుకు ఉండే సమతూకమే వేరు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడమే కాకుండా, కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ బౌలింగ్‌లోనూ సత్తా చాటడం అతని ప్రత్యేకత. దీనికి తోడు చురుకైన ఫీల్డింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్న అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా అతను గుర్తింపు పొందాడు.



