బాయ్ కాట్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్

దశాబ్దాలుగా ఎన్నో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న నటుడు ప్రకాష్ రాజ్ కు నటనలో ఎంత మంచి పేరు ఉందో.. ఆఫ్-స్క్రీన్ లో ముఖ్యంగా రాజకీయాల్లో ఆయనకు అంతకుమించిన కాంట్రవర్సీలు ఉన్నాయి. ఆయన పలు సందర్భాల్లో చేసిన కొన్ని కామెంట్స్ వల్ల, ప్రకాష్ రాజ్‌ను ఎప్పటినుంచో ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని ఒక వర్గం సోషల్ మీడియాలో తీవ్రంగా డిమాండ్ చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ వివాదం గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటించనున్నారన్న వార్త రావడంతో రాజమౌళికి నెటిజన్లు వార్నింగ్‌లు ఇస్తున్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ సైతం తనదైన స్టైల్ లో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమా ఒక విజువల్ వండర్. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా వారణాసి. ఈ చిత్రంలో ఒక అత్యంత కీలకమైన పాత్రకు ప్రకాష్ రాజ్‌ను రాజమౌళి ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమన్నాయి. ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో, అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ నెటిజన్స్ రాజమౌళిని టార్గెట్ చేశారు. ఎప్పుడూ ఒక మతానికి, ఒక సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రకాష్ రాజ్‌ను పవిత్రమైన వారణాసి పేరుతో తీస్తున్న సినిమాలో ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయన్ను వెంటనే ఆ ప్రాజెక్ట్ నుంచి బహిష్కరించాలని , లేదంటే సినిమాను బాయ్‌కాట్ చేస్తామని ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఒక గొప్ప ఆర్టిస్ట్‌ను సినిమాకు తీసుకోవాలా వద్దా అన్నది దర్శకుడి ఇష్టం అయినప్పటికీ, ప్రకాష్ రాజ్ పర్సనల్ ఇమేజ్ ఇప్పుడు ఆ సినిమా కాస్టింగ్ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది.
తన సినిమాలపై వస్తున్న బాయ్‌కాట్ కాల్స్, వారణాసి నుంచి తప్పించాలన్న డిమాండ్స్‌పై ప్రకాష్ రాజ్ ఎట్టకేలకు మౌనం వీడారు. తాజాగా ఒక టాక్ షోలో పాల్గొన్న ఆయన.. ఈ నెగిటివిటీపై తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తానొక నటుడినని, తన పర్సనల్ ఐడియాలజీకి, యాక్టింగ్‌కి లింక్ పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు. నేను బ్లాక్‌బస్టర్ సినిమా కేజీఎఫ్ లో నటించినప్పుడు కూడా నన్ను బ్యాన్ చేయాలని కొందరు గొడవ చేశారు, అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ఆ సినిమా ఆగిపోయిందా? ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో, ఎన్ని కోట్లు వసూలు చేసిందో అందరికీ తెలిసిందే కదా అని ఆయన గుర్తుచేశారు. అలాగే దృశ్యం 3 టైమ్‌లో కూడా నన్ను బ్యాన్ చేయాలని ప్రచారం చేసినా, అది అంతకంటే ఎక్కువ వసూళ్లను సాధించిందని ఆయన లాజికల్‌గా బదులిచ్చారు. ఒక నటుడిగా తన పనిని చూసి ఇష్టపడే ఏకైక ప్రేక్షకులకు.. తన వ్యక్తిగత అభిప్రాయాలతో, రాజకీయాలతో ఎలాంటి సమస్య లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ట్రోల్స్ చూసి తాను భయపడే రకం కాదని తేల్చిచెప్పారు.



