ఓజీ 3 పక్కా..థమన్ క్రేజీ లీక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. ఆయన సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి చాలా కాలం అవుతోంది. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న THEY CALL HIM ‘OG’ సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చే చిన్న లీక్ అయినా సరే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది. అలాంటిది ఏకంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ , పవన్ అభిమానులకు ఒక మైండ్ బ్లాంక్ అయ్యే సర్ప్రైజ్ ఇచ్చారు. ఓజీ సినిమా ఒక పార్ట్‌తో ఆగిపోవడం లేదని, ఏకంగా మూడు భాగాలుగా రాబోతోందని ఆయన రీసెంట్గా ఒక హింట్ ఇచ్చాడు. ఓజీ-2 స్క్రిప్ట్ ఏ రేంజ్లో ఉండబోతోందో ఆయన చెప్పిన మాటలకు ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి.
తాజాగా ఆయన పాల్గొన్న ఒక ప్రముఖ టీవీ షోలో ఓజీ సినిమా ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా థమన్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక కళ్లుచెదిరే అప్డేట్ ఇచ్చారు. ఓజీ సినిమా కథ చాలా భారీగా ఉందని, అది కేవలం ఒక పార్ట్‌తో ముగిసేది కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంటాయని ఆయన డైరెక్ట్‌గా ఆ షోలో వెల్లడించారు. ముఖ్యంగా పార్ట్ 2 స్క్రిప్ట్ గురించి థమన్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓజీ రెండో భాగానికి సంబంధించిన కథ మరో స్థాయిలో ఉండబోతోంది. సుజీత్ ఆ పార్ట్ 2 స్క్రిప్ట్‌ను స్పీకర్లు పగిలిపోయే రేంజ్లో రాసుకున్నాడు అని థమన్ చెప్పుకొచ్చారు. ఇక ఈ ఫ్రాంచైజీకి సంబంధించి టాలీవుడ్ సర్కిల్స్‌లో మరో భారీ ప్రచారం కూడా జరుగుతోంది. ఓజీ మొదటి భాగాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే రాబోయే భారీ యాక్షన్ సీక్వెల్స్ అయిన ఓజీ 2 , ఓజీ 3 సినిమాల నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కూడా భాగం కాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సొంత బ్యానర్‌పై నిర్మించడం ద్వారా.. సినిమా క్వాలిటీ, బడ్జెట్, ప్రొడక్షన్ వేల్యూస్ విషయంలో మరింత స్వేచ్ఛ ఉంటుందని పవన్ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఓజీ 2 కి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన ప్రొడక్షన్ డీటెయిల్స్, ఇతర యాక్టర్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్లో గట్టిగా వినిపిస్తోంది. టాలీవుడ్లో ఇప్పుడు ఫ్రాంచైజీల కల్చర్ నడుస్తోంది. బాహుబలి, పుష్ప, సలార్, కల్కి, దేవర.. ఇలా పాన్ ఇండియా స్టార్స్ అంతా తమ సినిమాలను రెండు, మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న హీరో కూడా ఓజీ ఫ్రాంచైజీతో రానున్నారు.



