బలూచ్ ల కొత్త నాయకుడు.. రెహ్మాన్ గుల్?

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు సొంత దేశంలోనే అతిపెద్ద ముప్పు ఎదురవుతోంది. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్‌కు స్వాతంత్ర్యం కావాలంటూ పోరాడుతున్న వేర్పాటువాద సాయుధ సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ . ఇప్పటికే పాక్ ఆర్మీకి ఈ సంస్థ చుక్కలు చూపిస్తోంది. బీఎల్ఏ కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌గా రెహ్మాన్ గుల్ ఎంట్రీతో పాక్ కు మరింత భయం పట్టుకుంది.
బలూచ్ లిబరేషన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా రెహ్మాన్ గుల్ నియమితుడయ్యాడు. అందరూ ఇతన్ని మురీద్ అనే ముద్దుపేరుతో కూడా పిలుస్తుంటారు. ఇతని నేపథ్యం చూసి పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ ఇప్పుడు వణికిపోతోంది. గతంలో రెహ్మాన్ గుల్ పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్ హోదాలో పనిచేశాడు. వజీరిస్తాన్ ప్రాంతంలో పాకిస్థాన్ తాలిబన్లపై పాక్ ఆర్మీ చేపట్టిన అత్యంత క్లిష్టమైన సైనిక ఆపరేషన్లలో ఇతను కీలకం . అయితే పాక్ ఆర్మీలో పనిచేస్తున్న సమయంలో.. సైన్యం బలూచ్ ప్రజలపై చేస్తున్న అకృత్యాలు, అన్యాయాలను చూసి అతని రక్తం మరిగిపోయింది. స్వతహాగా బలూచ్ ప్రాంతానికి చెందినవాడు కావడంతో, తన సొంత ప్రజల కోసం పాక్ ఆర్మీకి రాజీనామా చేసి ఏకంగా బీఎల్ఏ లో చేరిపోయాడు. సైన్యంలో తాను నేర్చుకున్న గెరిల్లా వార్ఫేర్, వ్యూహాలను బీఎల్ఏకు నేర్పించాడు. తన అద్భుతమైన టెక్నిక్స్‌తో బీఎల్ఏలోని అత్యంత ప్రమాదకరమైన మజీద్ బ్రిగేడ్ కు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ఏకంగా ఆ సంస్థకే కమాండర్-ఇన్-చీఫ్ కావడంతో పాక్ మిలిటరీకి అసలు పాకిస్థాన్ సైన్యంలో అత్యున్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి, అదే దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బీఎల్ఏకు నాయకుడు కావడం వెనుక ఉన్న ప్రధాన కారణం బలూచిస్థాన్‌పై పాక్ చేస్తున్న దోపిడీ. పాకిస్థాన్‌లో విస్తీర్ణం పరంగా బలూచిస్థాన్ అతిపెద్ద ప్రావిన్స్. సహజ వాయు, ఖనిజ నిక్షేపాలు ఉన్న ప్రాంతం. కానీ పాకిస్థాన్‌లో అత్యంత పేద ప్రజలు ఉన్నది కూడా ఇక్కడే. బలూచిస్థాన్ సంపదను పాకిస్థాన్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్ అభివృద్ధికి వాడుకుంటోంది కానీ, బలూచ్ ప్రజలకు కనీసం తాగునీరు, కరెంటు కూడా ఇవ్వడం లేదు. దీనికి తోడు చైనాతో కలిసి చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో బలూచిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టును పూర్తిగా చైనాకు అమ్మేశారు. దీనిని ప్రశ్నించిన బలూచ్ యువకులను, విద్యార్థులను పాక్ ఆర్మీ కిడ్నాప్ చేయడం, చిత్రహింసలు పెట్టి చంపేయడం లాంటివి ఎన్నో దశాబ్దాలుగా చేస్తోంది. ఈ ఆకృత్యాలను భరించలేకే బలూచ్ ప్రజలు ఆయుధాలు పట్టి స్వతంత్ర బలూచిస్థాన్ కోసం పాక్ ఆర్మీపై యుద్ధం చేస్తున్నారు.



