రాజమౌళి vs నితేశ్ తివారీ..రూ.1500 కోట్ల బాక్సాఫీస్ రేసులో రికార్డు ఎవరిది?

1500 కోట్ల క్లబ్ అనేది ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో ఒక డ్రీమ్ మార్క్. ఈ రేసులో బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ దశాబ్ద కాలంగా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. నితేశ్ తివారీ ఖాతాలో ఇప్పటికే దంగల్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఉంది. ఆమిర్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇండియన్ బాక్సాఫీస్‌తో పాటు చైనాలో కూడా ఊహించని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా చైనా కలెక్షన్లతో ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2000 కోట్లకు పైగా గ్రాస్ సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో దంగల్ టాప్ ప్లేస్లోనే ఉంది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు నితేశ్ తివారీ తెరకెక్కించిన విజువల్ వండర్ రామాయణ పార్ట్ 1 థియేటర్లలో బ్లాక్‌బస్టర్ టాక్‌తో నడుస్తోంది. వసూళ్లు వస్తున్న తీరు చూస్తుంటే త్వరలోనే ఇది 1500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమా ఇప్పటికే 1200 కోట్లు దాటేసింది. ఇదే గనక జరిగితే.. 1500 కోట్ల మార్క్ దాటిన రెండు సినిమాలు ఉన్న తొలి భారతీయ దర్శకుడిగా నితేశ్ తివారీ సరికొత్త రికార్డు సృష్టిస్తారు.
నితేశ్ తివారీ ప్రస్థానం కేవలం రెండు సినిమాలకే ఆగిపోయేలా లేదు. ఆయన ఏకంగా హ్యాట్రిక్ కొట్టడానికి స్కెచ్ వేశారు. రామాయణ మొదటి భాగానికి వస్తున్న రెస్పాన్స్ చూసి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. ఇక దీనికి కంటిన్యూయేషన్‌గా రామాయణ రెండో భాగం కూడా రావాల్సి ఉంది. వచ్చే ఏడాది దీపావళికి రామాయణ 2 థియేటర్లలోకి అఫీషియల్‌గా రానుంది. మొదటి భాగానికి వచ్చిన స్థాయిలోనే రెండో భాగానికీ మంచి రెస్పాన్స్ వస్తే, ఒకే దర్శకుడి మూడు సినిమాలు 1500 కోట్ల క్లబ్లో ఉండే అద్భుతమైన అవకాశం కూడా ఉంటుంది. పార్ట్ 2పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు మళ్ళీ మేకర్స్ వరల్డ్ వైడ్ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తే కలెక్షన్ల సునామీ రావడం గ్యారెంటీ. నెక్స్ట్ రామాయణ మొదటి భాగం 1500 కోట్లకు ఎంత త్వరగా చేరుతుందన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. నితేశ్ ఒకవేళ హ్యాట్రిక్ కొడితే, ఆ రికార్డును బ్రేక్ చేయడం ఇండియాలో ఏ డైరెక్టర్‌కీ సాధ్యం కాకపోవచ్చు.



