వృషకర్మతో నాగ చైతన్య….కింగ్ 100తో నాగార్జున…డిసెంబర్ లో బాక్సాఫీస్ సందడి

గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడిన నాగ చైతన్య, అఖిల్.. ఇటీవల భారీ బ్లాక్‌బస్టర్స్ కొట్టి ఫామ్‌లోకి వచ్చారు. నాగ చైతన్య ‘తండేల్’తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించగా అటు అఖిల్ కూడా లెనిన్ సినిమాతో ఏకంగా ఊరమాస్ హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ రెండు విజయాలతో అక్కినేని హీరోలపై మార్కెట్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కుర్ర హీరోలు ఇద్దరూ వంద కోట్ల క్లబ్లో చేరిపోయి దుమ్మురేపుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి చైతన్య, అలాగే కింగ్ నాగార్జున బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలోనే తండ్రీకొడుకులు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వృషకర్మ. ఒక డిఫరెంట్ మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్. ఈ భారీ చిత్రానికి బ్లాక్‌బస్టర్ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయ్యింది. ఈ సినిమా డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. మంచి కంటెంట్ ఉన్న వృషకర్మతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని నాగ చైతన్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొడుకు డిసెంబర్ 4న బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంటే, తండ్రి కూడా వెంటనే క్యూలో ఉన్నాడు. కింగ్ నాగార్జున ఈ ఏడాది తన లైనప్ తో అందరికీ షాక్ ఇస్తున్నాడు. రీసెంట్గా సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ , ధనుష్ కుబేర వంటి పాన్ ఇండియా సినిమాల్లో నటించి నాగ్ తనలోని మరో షేడ్స్‌ను అద్భుతంగా ఆవిష్కరించాడు. ప్రస్తుతం నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయి చిత్రం కింగ్ 100. ఈ సినిమాకి తమిళ యువ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదొక పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని, నాగార్జున క్యారెక్టరైజేషన్ ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
టాలీవుడ్ లో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒకే నెలలో విడుదల కావడం చాలా అరుదు. ఇప్పుడు అక్కినేని అభిమానులకు ఆ డబుల్ ట్రీట్ తో ఫీస్ట్ ఉండబోతోంది. ఇది తండ్రీకొడుకుల మధ్య జరిగే ఒక హెల్తీ బాక్సాఫీస్ క్లాష్ అని చెప్పొచ్చు. ఈ గ్యాప్‌లో రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అక్కినేని హీరోల జోరు అలాగే ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఖాయం. ఇక ఇప్పటికే నాగ చైతన్య తండేల్ సినిమాతో, అఖిల్ లెనిన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ మార్కును సునాయాసంగా అందుకున్నారు. కొత్త తరం హీరోలందరూ ఈ క్లబ్లో ఈజీగా చేరిపోతున్నారు. కానీ మూడు దశాబ్దాలుగా టాలీవుడ్‌ను ఏలుతున్న సీనియర్ స్టార్ నాగార్జున, ఇప్పటివరకు సోలో హీరోగా తన కెరీర్లో వంద కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయలేదు. ఈసారి ఏకంగా తన మైలురాయి చిత్రం కింగ్ 100 తో కింగ్ నాగార్జున కొట్టాలని ఇండస్ట్రీ వర్గాలు, ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.



