శ్రద్ధా కపూర్ అదిరిపోయే యాక్టింగ్..ఈథా ట్రైలర్ చూశారా?

స్త్రీ 2 సినిమాతో ఏకంగా వెయ్యి కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టి, కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రద్ధా కపూర్..ఇప్పుడు తన తదుపరి చిత్రం ఈత తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు రణ్‌దీప్ హుడా ప్రధాన పాత్రలో, దినేష్ విజన్ నిర్మాణంలో, డైరెక్టర్ లక్ష్మణ్ ఉటెకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ఈథా. మహారాష్ట్రకు చెందిన పురాణ జానపద కళాకారిణి విఠాబాయి నారాయణంగావ్కర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ వెండి తెర మీదకు వస్తోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కావడంతో మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. నెట్టింట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
మహారాష్ట్ర సంస్కృతిలో లావణి, తమాషా అనే జానపద నృత్యాలకు ఎంతో చరిత్ర ఉంది. ఆ లావణి నృత్యానికి ప్రాణం పోసి, ఒక మహారాణిలా వెలుగొందిన మహిళే విఠాబాయి నారాయణంగావ్కర్. ఎన్నో అవమానాలు, కష్టాలు, సమాజం నుంచి ఎదురైన ఛీత్కారాలను దాటుకుని తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్న ఒక ధీరవనిత ఆమె. ఒక నిండు చూలాలుగా ఉండి కూడా స్టేజ్ మీద ప్రదర్శన ఇచ్చేంత గొప్ప కళాకారిణి ఆమె. ఇప్పుడు సరిగ్గా ఆ పవర్ ఫుల్ ఎమోషన్ ను, ఆ ఆత్మగౌరవ పోరాటాన్ని ఈత సినిమాలో శ్రద్ధా కపూర్ కళ్లకు కట్టినట్లు చూపించబోతోంది.
మేకర్స్ రిలీజ్ చేసిన రెండున్నర నిమిషాల ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో, మోడ్రన్ డ్రెస్సుల్లో అలరించిన శ్రద్ధా కపూర్ ను ఇందులో పాత్రకు తగినట్లు మహారాష్ట్ర సంప్రదాయాన్ని ప్రతిబింబించే కళాకారిణిలా మారిపోయింది. ట్రైలర్ ప్రారంభం నుంచే లావణి నృత్యం వెనుక ఉన్న కష్టం, ఆ కళాకారుల జీవితాల్లో ఉండే చీకటి కోణాలను డైరెక్టర్ లక్ష్మణ్ ఉటెకర్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేశారు. ముఖ్యంగా శ్రద్ధా కపూర్ కేవలం నృత్యంలోనే కాకుండా, విఠాబాయి పాత్రలోని పౌరుషాన్ని, ఒక కళాకారిణిగా ఆమె పడే ఆవేదనను తన కళ్లలోనే పలికించింది. ట్రైలర్ లో కొన్ని చోట్ల శ్రద్ధా కపూర్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. నటన పరంగా తన కెరీర్లోనే ఇది ఒక మైల్ స్టోన్ పర్ఫార్మెన్స్ కాబోతోందని ట్రైలర్ ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమాలో మరో మేజర్ హైలైట్ వర్సటైల్ యాక్టర్ రణ్‌దీప్ హుడా. ఎంచుకున్న ప్రతి పాత్రకు వంద శాతం న్యాయం చేసే రణ్‌దీప్ హుడా, ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కు ధీటుగా ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించాడు. ఇక ఈ సినిమాలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌ను, ఆ కాలం నాటి మహారాష్ట్ర పల్లె వాతావరణాన్ని ఆర్ట్ డైరెక్టర్లు అద్భుతంగా రీక్రియేట్ చేశారు. ట్రైలర్ బ్యాక్‌గ్రౌండ్ లో వినిపించే ఫోక్ మ్యూజిక్, ఆ డప్పుల చప్పుడు మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. మొత్తంగా చూస్తే.. ఈత ట్రైలర్ ఒక బలమైన ఎమోషనల్ అండ్ కల్చరల్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది.



