సినిమా ఈవెంట్‌కు ఎందుకు రాలేదంటే?..పాత్ర కోసం కఠిన నియమాలు.. నయనతార డెడికేషన్‌కు సుందర్ సి ఫిదా..!

సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ అనగానే టక్కున గుర్తొచ్చే ఏకైక పేరు నయనతార . ఆమె నటన, గ్లామర్, బాక్సాఫీస్ స్టామినా గురించి ఎంత చర్చ జరుగుతుందో.. ఆమె సినిమా ప్రమోషన్లకు రాకపోవడం గురించి కూడా ఇండస్ట్రీలో అంతే స్థాయిలో చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే, ఇటీవల కాలంలో ఆమె తనకు రూల్ బ్రేక్ చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కోసం ఆమె ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొనడం, ఆ తర్వాత టాక్సిక్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనూ స్టేజ్ మీద సందడి చేయడంతో అభిమానుల్లో ఒక్కసారిగా కొత్త ఆశలు చిగురించాయి. ఇకపై నయన్ కూడా మిగతా హీరోయిన్ల లాగా సినిమా ప్రమోషన్లలో యాక్టివ్‌గా ఉంటుందని, తమ ఫేవరెట్ హీరోయిన్ను ప్రతి ఈవెంట్లో చూసుకోవచ్చని ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. కానీ, అభిమానుల ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లుతూ నయనతార తాజాగా మరోసారి తన పాత పద్ధతినే కంటిన్యూ చేశారు.
ఆమె ప్రధాన పాత్రలో కోలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా మూకుత్తి అమ్మన్ 2. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన మూకుత్తి అమ్మన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. దీంతో ఈ సెకండ్ పార్ట్‌ను సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇక్కడ అసలైన విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు వేల్స్ ఇంటర్నేషనల్ సంస్థతో పాటు దర్శకుడు సుందర్ సి, స్వయంగా నయనతార కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇంతటి భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి ఇటీవల చెన్నైలో అత్యంత ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సొంత నిర్మాత, మెయిన్ లీడ్ అయిన నయనతార హాజరు కాకపోవడంతో ఆ కార్యక్రమం కాస్త డల్ గానే సాగింది. వేరే నిర్మాతల సినిమాలకు రాకపోయినా అర్థం చేసుకోవచ్చు కానీ, తాను స్వయంగా నిర్మిస్తున్న ఈ భారీ సినిమా ఈవెంట్‌కు నయనతార ఎందుకు రాలేదని అభిమానులు, సినీ విశ్లేషకులు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇక ఈ సినిమాను హారర్ అండ్ డివోషనల్ సినిమాలను కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కించడంలో దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తుండడం ఈ చిత్రంలో నయనతార తొలిసారిగా అమ్మవారి పాత్రతో పాటు మరో సాధారణ మహిళ పాత్రలో డ్యుయల్ రోల్ చేస్తుండటం ఈ సినిమాకు అతిపెద్ద హైలైట్ గా మారబోతోంది.ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో నయనతారను ఢీకొట్టే పవర్ ఫుల్ ప్రతినాయకురాలి పాత్రలో టాలెంటెడ్ యాక్ట్రెస్ రెజీనా కసాండ్రా కనిపించనుంది. ఒక పవర్ ఫుల్ అమ్మవారికి, అత్యంత భయంకరమైన దుష్టశక్తికి మధ్య జరిగే పోరును సుందర్ సి తన మార్క్ అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారని సమాచారం. మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న సినిమా, అందులోనూ సొంత సినిమా ఈవెంట్‌కు నయనతార ఎందుకు రాలేదు? దీనిపై ఈవెంట్ వేదికగానే చిత్ర బృందం స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. నయనతార కావాలని ఈ ఈవెంట్ ను స్కిప్ చేయలేదని, ప్రస్తుతం ఆమె బాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన ఇతర సినిమా షూటింగ్ షెడ్యూల్స్ తో ఫుల్ బిజీగా ఉండటం వల్లే ఆమె ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని వారు స్పష్టం చేశారు. ఇదే వేదికపై దర్శకుడు సుందర్ సి మాట్లాడుతూ.. నయనతార డెడికేషన్ గురించి ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో అమ్మవారి పాత్ర చేస్తున్నప్పుడు నయనతార ఎంతో భక్తితో, నిష్టగా ఉన్నారు. ఆ షూటింగ్ షెడ్యూల్ జరిగిన ఇన్ని నెలల పాటు ఆమె పూర్తిగా నాన్‌వెజ్‌కు దూరంగా ఉండిపోయారు. ఒక కమర్షియల్ హీరోయిన్ గా ఉంటూనే, ఒక భక్తిరస పాత్ర పట్ల, సినిమా పట్ల ఆమె చూపించిన ఈ నిబద్ధత నిజంగా గ్రేట్. అందుకే ఆమెను లేడీ సూపర్ స్టార్ అంటారు అని సుందర్ సి వెల్లడించారు. డైరెక్టర్ చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత నయన్ అభిమానులు కాస్త కూల్ అయ్యారు. ప్రమోషన్లకు దూరంగా ఉన్నప్పటికీ, నయనతార తన పర్ఫార్మెన్స్ తో, తనకంటూ ఉన్న బ్రాండ్ ఇమేజ్ తో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న ఏకైక నటి. నవంబర్ 6న రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది.



