సూర్య 49 ఫిక్స్..వరుస హిట్లతో జోరు..సూపర్ లైనప్

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు సూర్య.. ప్రస్తుతం వరస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేసి సూర్య స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేశాయి. ఇప్పుడు అదే జోష్ లో ఈ దీపావళి పండక్కి సీన్ అనే క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సూర్య ముస్తాబవుతున్నారు. ప్రస్తుతం ఆయన టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 48వ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. జ్ఞానవేల్ తో ఇదివరకు జై భీమ్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈసారి కూడా జ్ఞానవేల్ ఒక బలమైన సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ హంగులు మిక్స్ చేసి సూర్యను ఒక పవర్ ఫుల్ రోల్ లో ప్రెజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది. దీపావళికి రాబోతున్న సీన్ సినిమా తర్వాత, ఈ ప్రాజెక్ట్ పైనే సూర్య పూర్తి ఫోకస్ పెట్టనున్నారు.ఇక కోలీవుడ్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం సూర్య 49వ చిత్రం గురించి ఈ ప్రాజెక్ట్ కోసం తమిళ ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ మార్క్ క్రియేట్ చేసిన మతిమారన్ పుగళేందితో సూర్య చేతులు కలపనున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. మతిమారన్ దర్శకత్వంలో వచ్చిన మండాడి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో, విమర్శకుల ప్రశంసలు అందుకుందో మనకు తెలిసిందే. ఆయన ఇటీవల సూర్యను కలిసి ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ వినిపించినట్లు సమాచారం.అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్, కోలీవుడ్ లలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ నిర్మించిన ప్రముఖ సీనియర్ నిర్మాత కలైపులి ఎస్.థాను తన ప్రతిష్టాత్మక వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఒక హీరో కెరీర్ లో 50వ సినిమా అనేది చాలా స్పెషల్. దాన్ని ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. సూర్య 50వ సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతోంది. సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కరుప్పు సినిమాకు సీక్వెల్ గా కరుప్పు 2 సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది. ఒకవైపు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే, మరోవైపు కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్స్ తో బ్యాలెన్స్ చేయడం సూర్యకే సాధ్యం. టీజే జ్ఞానవేల్ తో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ, మతిమారన్ తో ఒక ఇంటెన్స్ డ్రామా, కరుప్పు 2 తో ఊరమాస్ సీక్వెల్.. ఈ లైనప్ చూస్తుంటే రాబోయే రెండు మూడేళ్లు బాక్సాఫీస్ వద్ద సూర్య హవా నడవడం ఖాయంగా కనిపిస్తోంది.



