వైసీపీ నుంచి తప్పుకోగానే అలా షాకులు ! గుర్తు చేసుకున్న కోటంరెడ్డి ..!
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నేషనల్ హైవేపై 75 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు, సర్వీస్ రోడ్ల పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాక ఈ పనులు ప్రారంభించానని, రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక పనులు మొదలయ్యాయని, కానీ వైసీపీ నుంచి తప్పుకున్నాక మాత్రం ఆగిపోయాయని గుర్తుచేసుకున్నారు. గత ప్రభుత్వంలో ఈ పనులు మంజూరైనా, తాను వైసీపపీ నుంచి దూరంగా జరిగాక ఈ పనులు ఆగిపోయాయన్నారు. ఈసారి […]
తిరుపతి కార్పోరేషన్ ఆఫీసు శుభ్రం చేసిన అధికారులు-ఎందుకో తెలుసా ?
తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో అధికారులు శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం స్వచ్ఛతాహీ సేవలో భాగంగా అధికారులు చీపుళ్లు చేతబట్టి కార్యాలయాన్ని శుభ్రం చేశారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో పాటు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా కమిషనర్ స్వయంగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారు.
త్వరలో ఆ ఎన్నికలు-ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన.. !
గత ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమై పోయిందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తిరిగి దాన్ని గాడిన పెట్టేందుకు రైతుల భాగస్వామ్యంతో ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సాగునీటి వ్యవస్థకు పునర్జీవనం కలిగించే విధంగా ఎన్నికలు నిర్వహించడానికి జీవో విడుదల చేసినట్లు రామానాయుడు తెలిపారు. నవంబర్ మొదటి వారంలోపు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
పవన్ కు మద్దతుగా చిన వెంకన్న సన్నిధిలో జనసేన నేత దీక్ష..!
తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో అపరాధం జరిగిందన్న వార్తల నేపథ్యంలో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఏలూరు జనసేన నేత నారా శేషు తెలిపారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కు సంఘీభావంగా ద్వారకా తిరుమల చిన వెంకన్న సన్నిధిలో ఆయన వారం రోజుల దీక్ష చేపట్టారు. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల […]
వాళ్లు క్రిస్టియన్లేగా-డిక్లరేషన్ ఇవ్వు..!పవన్ కు మాజీ డిప్యూటీ సీఎం డిమాండ్..!
తన భార్య పిల్లలు క్రిస్టియన్లని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్.. తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ పై సంతకం చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా ప్రభుత్వ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ప్రజాసంకల్పయాత్ర ముగించుకుని తిరుమలకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు డిక్లరేషన్ లో సంతకం చేయాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.కొత్తగా డిక్లరేషన్ లో సంతకం పెట్టాలని అడగడంలో ఆంతర్యం […]
జగన్ అప్పుడు మాంసం కూడా ముట్టరు-చెవిరెడ్డి సంచలనం..!
తిరుమల టూర్ రద్దు విషయంలో వైసీపీ అధినేత జగన్ పై వస్తున్న విమర్శలను ఆ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుబట్టారు. గతంలో జగన్ 3680 మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని గుర్తుచేశారు. ఆయన తిరుమలకు వచ్చే రోజు మాంసం కూడా ముట్టరని తెలిపారు. తండ్రి రాజశేఖరరెడ్డి చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం పిండ ప్రధానం చేశారని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డికి దేవుడంటే భక్తి భావన ఎక్కువన్నారు. ఇంట్లోనే గోశాలను నిర్మించుకొని, గోవులకు […]
జగన్ అందుకే వెళ్లలేదు- ఇంట్లో వాళ్లే మాట వినరు -బుద్ధా వెంకన్న షాకింగ్ ..!
తిరుమలను జగన్ స్వార్ద రాజకీయాల కోసం వాడుకోవడం నీచమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. తిరుమల వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదనడం హాస్యాస్పదం అన్నారు. మనం అనుకుంటే కాదు, స్వామి అనుగ్రహిస్తేనే తిరుమల వెళ్లగలమన్నారు. వెంకన్న అనుమతి లేదు కాబట్టే జగన్ వెళ్లలేకపోయారన్నారు. బైబిల్ ఇంట్లో చదువుకునే జగన్ కు వెంకన్న మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని బుద్ధా ప్రశ్నించారు. నిబంధనల మేరకు డిక్లరేషన్ అడిగితే రాద్దాంతం ఎందుకన్నారు. నీ ఇంట్లో నీ భార్యని […]
జనసైనికులపై రెచ్చిపోయిన పేర్ని కిట్టు..! ఇల్లు ముట్టడికి వస్తారా..
బందరులో తన ఇంటి ముట్టడికి వచ్చిన జనసైనికులపై మాజీ మంత్రి పేర్నినాని తనయుడు కిట్టు రెచ్చిపోయారు. తన ఇంటి ముట్టడికి ఎలా వస్తారని వారిని ప్రశ్నించారు. జనసేన క్యాడర్ పేర్ని నాని దిష్టిబొమ్మ దహనం చేసి నిరసనలకు దిగడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మీకు 40 మంది ఉంటే మాకు 400 మంది ఉన్నారంటూ నిరసనకు వచ్చిన వారిని హెచ్చరించారు. ఇలాంటి చర్యల్ని సహించబోమన్నారు.
సింహాద్రి అప్పన్న సేవలో లోకేష్..!
విశాఖలోని సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అధికారులు సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. అనంతరం లోకేష్ స్వామివారికి పూజలు నిర్వహించారు. వేదపండితులు లోకేష్ కు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
స్వచ్ఛతపై అవగాహనకు తిరుపతిలో 3కే రన్-తరలివచ్చిన జనం..!
తిరుపతి నగర పౌరులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు కార్పోరేషన్ ఇవాళ సిటీలో 3కే రన్ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం స్వచ్ఛత-హి-సేవలో భాగంగా ఈ రన్ నిర్వహించారు. నగరంలోని వివేకానంద సర్కిల్ నుంచి ఎస్వీయూ ఆడిటోరియం వరకు ఈ రన్ జరిగింది. ఇందులో విద్యార్థులతో పాటు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక […]