తెలంగాణ సీఐడీ పోలీసులు ఫాల్కన్ ఎండీ అమర్దీప్ ను అరెస్ట్ చేశారు.ముంబయిలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి ఆయన ముంబయికి చేరుకోవడంతో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని తెలంగాణ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించారు. డిజిటల్ డిపాజిట్ల పేరిట అమర్ దీప్ రూ.850 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. యాప్ బేస్డ్ డిపాజిట్లతో ఫాల్కన్ సంస్థ భారీ కుంభకోణానికి తెరతీసింది. షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ప్రజలను అమర్ మభ్యపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం వెలుగులోకి రాగానే అమర్ దీప్ దంపతులు దుబాయ్ పారిపోయారు. ఈ కేసులో ఇప్పటికే సీఈవో,అమర్ దీప్ సోదరుడిని అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ వెబ్సైట్, యాప్లతో మోసాలతో దాదాపు 7,056 మంది డిపాజిటర్లు.. అందులో 4,065 మంది బాధితులు ఉన్నారని తెలిపారు. 12 ప్లాట్లు, 4 లగ్జరీ కార్లు, నగదు, బంగారం, షేర్లను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.