గ్రామాల్లో ఏకగ్రీవాల జోరు.. ఏపీ తొలి దశ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి దశ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా ఎన్ని పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికల్లో గా 3,191 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి దశలో మొత్తం 3,949 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే 758 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 39,832 వార్డుల్లో 14,727 వార్డు మెంబర్ల స్థానాలు కూడా ఏకగ్రీవమవడం గమనార్హం. ఎక్కువగా తిరుపతి జిల్లాలో 135 మంది సర్పంచులు, తక్కువగా అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డుల్లోనూ ఎక్కువ స్థానాల్లో తిరుపతి జిల్లాలోనే 2,131, తక్కువ స్థానాల్లో తూర్పుగోదావరి జిల్లాలో 45 వార్డులు ఏకగ్రీవంగా ఉన్నాయి. ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏకగ్రీవం కావడంతో పోటీ చేసే అభ్యర్థులకు ప్రచారం, ఇతరత్రా అయ్యే భారీ ఎన్నికల వ్యయం మిగులుతుంది. అలాగే ప్రభుత్వానికి కూడా పోలింగ్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల ఖర్చు మిగిలినట్లే. సామరస్యంతో ఏకగ్రీవం అవడం అనేది గ్రామ ప్రజల ఐక్యతను, ఏకాభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఎన్నికలు ఏకగ్రీవం కావడం వల్ల పోటీదారులకు ఆర్థిక భారం పూర్తిగా తప్పుతుంది. సాధారణంగా ఎన్నికల ప్రచారం, సభలు, ఇతర ఖర్చుల కోసం అభ్యర్థులు లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఏకగ్రీవ ఎన్నికల పుణ్యమా అని అభ్యర్థులకు ఈ భారీ వ్యయం మిగిలిపోతుండటం వారికి పెద్ద ఊరటనిచ్చే అంశం. ఇక అభ్యర్థులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కూడా ఏకగ్రీవాలు ఆర్థికంగా మేలు చేస్తున్నాయి. పోలింగ్ నిర్వహణ, సిబ్బంది కేటాయింపు, భద్రతా ఏర్పాట్ల కోసం ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వందలాది పంచాయతీలు, వేలాది వార్డుల్లో పోలింగ్ అవసరం లేకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగానికి శ్రమతో పాటు కోట్లాది రూపాయల ఖర్చు ఆదా అవుతోంది.



