రామాయణలో రావణుడిగా ‘యష్’ డెడికేషన్ పై ప్రశంసలు..!

ఇటీవల విడుదలైన ‘రామాయణ’ సినిమాలో హీరోకు ధీటుగా, చెప్పాలంటే రామాయణానికే హైలైట్‌గా నిలిచిన పాత్ర రావణాసురుడు. ఈ పవర్ఫుల్ క్యారెక్టర్లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఆయన తెరపై రావణాసురుడిగా యశ్ అంత గంభీరంగా కనిపించడం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది.
ఈ రామాయణం సినిమాకు కాస్ట్యూమ్ స్టైలిస్ట్‌గా పనిచేసిన సానియా సర్ధారియా .. యశ్ పడిన కష్టం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. షూటింగ్ సమయంలో యశ్ ధరించిన కాస్ట్యూమ్స్, ఆభరణాల బరువు 16 నుంచి 20 కిలోల వరకు ఉండేదని సానియా తెలిపారు. కేవలం ఒక షార్ట్ లేదా సన్నివేశం కోసం కాదు, ఉదయం మేకప్ వేసుకున్నప్పటి నుంచి సాయంత్రం ప్యాకప్ చెప్పే వరకు యశ్ ఆ 20 కిలోల బరువును తన ఒంటిపై మోస్తూనే భారీ డైలాగులు చెప్పేవారు. ఒక నటుడి డెడికేషన్‌కు ఇది అతిపెద్ద నిదర్శనం.
రోజువారీ షూటింగ్లో 20 కిలోల బరువు మొయ్యడమే గొప్ప విషయం అనుకుంటే.. కొన్ని ప్రత్యేక సన్నివేశాల్లో ఈ బరువు అమాంతం పెరిగిపోయేదట. భారీ పట్టు దుస్తులు, కవచాలు, కత్తులు, ఆభరణాల మొత్తం బరువు ఏకంగా 30 నుంచి 33 కిలోల వరకు ఉండేదని కాస్ట్యూమ్ డిజైనర్ సానియా గుర్తుచేసుకున్నారు. ఇక రావణుడి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడంలో చిత్ర యూనిట్‌కు అత్యంత క్లిష్టమైన సవాల్‌గా మారింది అతని కిరీటం. ముందుగా కిరీటం డిజైన్ పక్కాగా కుదిరాక, దాన్ని నేరుగా బంగారంతోనో లేదా లోహంతోనో చేయకుండా.. చాలా 3D నమూనాలను తయారు చేశారు. దాన్ని లైట్ వెయిట్ మెటీరియల్‌తో చేయడానికి రివర్స్ ఇంజనీరింగ్ విధానాన్ని వాడారు. ఒక పక్క రాయల్ లుక్ మిస్ అవ్వకుండా, మరోపక్క బరువు తగ్గించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆ కిరీటం బరువును దాదాపు 2 కిలోలు తగ్గించలేకపోయామని సానియా స్పష్టం చేశారు. అంటే తల మీద 2 కిలోల కిరీటాన్ని పెట్టుకుని, ఆ గంభీరమైన వాయిస్‌తో డైలాగులు చెప్పడం అంటే మాటలు కాదు. ఇంత బరువైన దుస్తులు, కవచాలు వేసుకుంటే ఎవరికైనా చిరాకు వస్తుంది. ఏసీలు ఎన్ని పెట్టినా చెమటలు పోస్తాయి. కనీసం కుర్చీలో ప్రశాంతంగా కూర్చోవడానికి కూడా వీలుపడదు. యశ్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఎంతో డెడికేషన్‌తో పనిచేశారని చిత్ర యూనిట్ ప్రశంసిస్తోంది. నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ రామాయణ చిత్రం.. ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెబుతోంది. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ సాధు స్వభావం, రావణాసురుడిగా యశ్ పౌరుషం మధ్య జరిగే క్లాష్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను అంగీకరించడం యశ్ గట్స్ ఏంటో నిరూపిస్తోంది.



