పాన్ ఇండియా రేంజ్లో పొలిమేర 3…గ్లింప్స్‌తో గూస్బంప్స్!

చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ మా ఊరి పొలిమేర . ఆ తర్వాత థియేటర్లలోకి వచ్చిన పొలిమేర 2 బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కాసుల వర్షం కురిపించింది. ఊహించని ట్విస్టులు, భయపెట్టే క్షుద్ర విద్యలతో ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు ముచ్చటగా మూడో భాగం రాబోతోంది. అయితే ఈసారి రేంజ్ మారింది.. బడ్జెట్ పెరిగింది.. ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో పొలిమేర 3 ముస్తాబవుతోంది. తాజాగా దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన సెన్సేషనల్ గ్లింప్స్ ఆసక్తిని మరింత పెంచేశాయి. ఇప్పటి వరకు కొమరయ్యగా సత్యం రాజేష్ చేసిన మాయాజాలాన్నే చూసిన ప్రేక్షకులకు, ఇప్పుడు ఈ చీకటి ప్రపంచంలోకి యాక్షన్ కింగ్ ఎంట్రీ దడ పుట్టిస్తోంది. దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ సృష్టించిన పొలిమేర విశ్వం.. మూడో భాగంతో మరింత విశాలంగా, మరింత భయంకరంగా మారబోతోందని తాజాగా విడుదలై గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాలో అర్జున్ సర్జా విరావి అనే అత్యంత పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆధ్యాత్మికత, క్షుద్రవిద్యలు, యాక్షన్ కలగలిపిన ఆయన లుక్, హావభావాలు సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ మధ్యే బ్లాస్ట్ మూవీతో విలన్‌గా మెప్పించిన యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా.. ఇప్పుడు ఇలాంటి ఒక డిఫరెంట్ మిస్టిక్ థ్రిల్లర్‌లో భాగం కావడం సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేసింది. ఆయన పాత్ర చూస్తుంటే, ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ నేపథ్యం ఉండి తీరుతుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.
గ్లింప్స్‌లో అనంత పద్మనాభుడి సాక్షిగా అని రాసి ఉండటంతో, కేరళలోని ఆ ప్రసిద్ధ దేవాలయానికి, ఈ క్షుద్ర పూజలకు ఏదో బలమైన లింక్ ఉందన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈసారి పొలిమేర 3 లో కొమరయ్య వర్సెస్ విరావి మధ్య పోరు వెండితెరపై ఒక మహా యుద్ధంలా ఉండబోతోంది. ఒకవైపు బ్లాక్ మ్యాజిక్ , మరోవైపు రా యాక్షన్.. ఈ రెండు ఎలిమెంట్స్ ఢీకొడితే థియేటర్లలో సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఈ ఫ్రాంచైజీకి ఉన్న అతిపెద్ద బలం దాని ఊహించని ట్విస్టులు. ఈ మూడో భాగంలో ఆ ట్విస్టులు మైండ్ బ్లాక్ చేసే రేంజ్లో ఉంటాయని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను..వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. వంశీ నందిపాటి, భరత్ నారంగ్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తొలి రెండు భాగాలతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన ఈ సిరీస్‌ను, ఇప్పుడు ఏకంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, కృష్ణ ప్రసాద్ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌లోని చీకటి ప్రపంచాన్ని మరింత భయంకరంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మంచి స్టాండర్డ్ లో ఉంది. అన్ని అంశాలు ఆసక్తికరంగా ఉండడంతో ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పొలిమేర 3 స్క్రిప్ట్ ఉండబోతోందని స్పష్టమవుతోంది.



