ముంబై మాఫియాపై దండయాత్ర.. దాదా ఈజ్ కమింగ్..!

మన టాలీవుడ్లో ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు ఎప్పుడూ ఒక సెన్సేషన్. ఒక తెలుగు వాడు ముంబై వెళ్లి అక్కడ సామ్రాజ్యాన్ని స్థాపిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో మనం చాలా సినిమాల్లో చూశాం. ఇప్పుడు బాలయ్య కూడా అదే పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ రోల్లో దాదా మూవీలో కనిపించబోతున్నారు. గోపీచంద్ మలినేని మార్క్ ఎలివేషన్స్, దానికి బాలయ్య బేస్ వాయిస్ తోడైతే ముంబై అండర్ వరల్డ్ దద్దరిల్లాల్సిందే. ఈ సినిమాలో బాలకృష్ణ కేవలం ఒకే యాంగిల్లో కాకుండా, రెండు కోణాలున్న పాత్రలో అలరించనున్నారని తెలుస్తోంది.ఈ దాదా సినిమాకు సంబంధించి బాలయ్య తర్వాత అత్యంత ఆసక్తికరమైన అంశం దీని స్టార్ కాస్ట్. ఎందుకంటే, చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ .. ఈ చిత్రంలో ఒక అత్యంత కీలకమైన, పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది. గతంలో బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలో నటించి మెప్పించిన కాజల్, ఇప్పుడు ముంబై బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో చేస్తోంది. అలాగే బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ సమర్పణలో, వెంకట సతీశ్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సాధారణంగా బాలకృష్ణ సినిమా నుంచి ఫస్ట్ లుక్ లేదా ఫస్ట్ సాంగ్ వస్తుందంటే.. అది ఒక పవర్ఫుల్ డైలాగ్తోనో, లేదా భారీ యాక్షన్ ఎపిసోడ్తోనో ఉంటుంది. కానీ గోపీచంద్ మలినేని ఈసారి బాలయ్యను ఎంతో స్టైలిష్‌గా , సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఎవరైనా విజిల్స్ వేయాల్సిందే. అందులో బాలయ్య చేతిలో తుపాకీ పట్టుకుని, బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీతో కలిసి అదిరిపోయే స్టెప్పులేస్తూ కనిపించారు. దాదా ధమాకా పేరుతో రానున్న ఈ పాటను నవంబర్ 13న అధికారికంగా విడుదల చేయనున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేసే బాలకృష్ణ.. ఈసారి కాస్త ముందుగానే బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. డిసెంబర్ 24న, అంటే క్రిస్మస్ హాలిడేస్‌ను క్యాష్ చేసుకునేలా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. క్రిస్మస్ , న్యూ ఇయర్ సెలవులు వరుసగా రావడం, ఆ సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు ఎక్కువగా రావడం దాదా కు అతిపెద్ద ప్లస్ పాయింట్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.



