సూర్య నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్..కోలీవుడ్‌ను షేక్ చేస్తున్న లేటెస్ట్ అప్డేట్!

ఈ ఏడాది ‘కరుప్పు’, ‘విశ్వనాథన్ ఆనంద్’, తాజాగా ‘సీన్’ సినిమాలతో సూర్య మంచి హిట్స్ ను అందుకున్నారు. వరుస విజయాలతో సూర్య తన నెక్స్ట్ లైనప్‌ను మరింత పకడ్బందీగా సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ సర్కిల్స్‌లో సూర్య 49వ చిత్రం గురించిన ఒక క్రేజీ అప్డేట్ ట్రెండింగ్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఒక క్లాసిక్ ఎంజీఆర్ మూవీ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని, అగ్ర నిర్మాత కలైపులి ఎస్. థాను ఈ భారీ యాక్షన్ డ్రామాను నిర్మించబోతున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. సూర్య 49వ సినిమాకు సంబంధించి ప్రస్తుతం వినిపిస్తున్న టైటిల్ పడగోట్టి. ఇది మామూలు టైటిల్ కాదు.. దివంగత లెజెండరీ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ టైటిల్ ఇది. అప్పట్లో ఆ సినిమా ఒక సెన్సేషన్. ఇప్పుడు అదే పవర్ ఫుల్ టైటిల్‌తో సూర్య బరిలోకి దిగుతున్నాడు. ఈ చిత్రానికి మండాడి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను . ఆయన వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ పడగోట్టి సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. సూర్య రాబోయే చిత్రాల లైనప్ చూస్తుంటే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. ఒక పక్క సీన్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండగా, సూర్య తన 48వ సినిమాను ఇప్పటికే లైన్లో పెట్టేశాడు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో టి. జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. 2027 మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని రిలీజ్ చేసేందుకు హోంబలే ఫిలిమ్స్ సన్నాహాలు చేస్తోంది.. ఒక స్టార్ హీరో ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా ఎప్పటికప్పుడు విలక్షణమైన పాత్రలతో కొత్తదనాన్ని ప్రోత్సహిస్తూ తన విజయ పరంపరను ముందుకు తీసుకెళ్లడంలో సూర్య పక్కా ప్లానింగ్‌తో ఉన్నాడు.



